హాట్‌టాపిక్‌గా మారిన మోడీ ఫొటో..

SMTV Desk 2019-08-05 16:33:00  

జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పాత ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 307 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటన చేసిన తర్వాత.. 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలంటూ జరిగన ఆందోళన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 370 ఆర్టికల్‌కు నిరసన జరుగుతున్న కార్యక్రమంలో నరేంద్ర మోడీ కూర్చొని ఉండగా... వెనుక ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ‘370 అధికరణను రద్దు చేయండి... ఉగ్రవాదాన్ని నిర్మూలించండి... దేశాన్ని కాపాడండి’ అని రాసిఉంది. ఈ నిరసన కార్యక్రమం ఎంత వరకు నిజం..? దాంట్లో మోడీ పాల్గొన్నారా? లేదా? అనే విషయం తేలాల్సి ఉన్నా.. ఇప్పుడు ఆ ఫొటో మాత్రం వైరల్‌గా మారింది.