మహిళలకు ఐసీఐసీఐ స్పెషల్ ఆఫర్!

SMTV Desk 2019-08-05 16:31:59  

ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తాజాగా మహిళలకు ఓ ఆఫర్ ప్రకటించింది. మరీముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. వర్కింగ్ ఉమెన్స్‌ మాత్రమే ఈ ఖాతా ప్రారంభించేందుకు అర్హులు. బ్యాంక్ ఖాతా పేరు అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అకౌంట్. ఇది రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌ కాదు. ఈ ఖాతా కలిగిన వారు వివిధ రకాల ఆఫర్లు పొందొచ్చు. బ్యాంకుకు వెళ్లి లేదా, 1800 200 3045 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌‌లో రిక్వెస్ట్ చేయడం ద్వారా ఈ ఖాతాను ప్రారంభించొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అకౌంట్ మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.10,000. అకౌంట్ వేరియంట్‌ ప్రాతిపదికన ఈ మొత్తం మారుతుంది. ✺ ఎంటర్‌టైన్‌మెంట్, డైనింగ్, జువెలరీ వంటి వాటిపై డెబిట్ కార్డుతో చేసే ఖర్చులపై నెలకు రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ✺ అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచి ఎన్నిసార్లైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు ఉండవు. ✺ హోమ్ లోన్స్‌పై పలు ప్రయోజనాలు పొందొచ్చు. రుణంపై తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుపై డిస్కౌంట్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ✺ లాకర్ రెంటల్స్‌పై 50 శాతం డిస్కౌంట్ ఉంది. ✺ అకౌంట్‌లోని డబ్బులను ఆటోమేటిక్‌గానే ఫిక్స్‌డ్ డిపాజిట్లుగామార్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ✺ కొత్తగా హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుత హోమ్‌లోన్‌పై టాప్ అప్ తీసుకున్నా ఇదే డిస్కౌంట్ ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు జీరో ప్రాసెసింగ్ ఫీజు సౌలభ్యం ఉంది.✺ టూవీలర్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజులో రూ.499 తగ్గింపు పొందొచ్చు. వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్‌కు సమంగా లోన్ పొందొచ్చు. ఇతర వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు ఉంది.