మిఠాయిలు పంచిన ఉద్ధవ్ థాకరే

SMTV Desk 2019-08-05 16:26:49  

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసే బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీ నేతలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మిఠాయిలును పంచారు. అంతే కాదు ముంబైలోని బస్సులతో పాటు పలు ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ఈ రోజుతో మన దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. దివంగత ప్రధాని వాజ్ పేయి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేల కల ఈరోజు నెరవేరిందని తెలిపారు. విపక్షాలన్నీ తమతమ రాజకీయ చట్రాల నుంచి బయటకు రావాలని... దేశ సమగ్రతకు మద్దతు ప్రకటించాలని కోరారు.