నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను తాకుతోంది

SMTV Desk 2017-08-30 13:47:16  Kashmir, Terrorist attacks, Johra, Social Media, DIG of Police Kashmir

కాశ్మీర్, ఆగస్ట్ 30: గత కొంతకాలంగా తమదైన రీతిలో ఉగ్రవాదులపై విరుచుపడుతున్న భారత సైన్యం ఇటు ఉగ్రవాదులపై పంజా విసురుతూనే, తమ ప్రాణాలను సైతం దేశం కోసం అంకితం చేస్తున్నారు. తాజాగా ముష్కర మూక దాడిలో మరణించిన ఓ జవాను కుమార్తెను ఓదార్చేందుకు సైన్యాధికారులు సైతం దిగివచ్చారు. గడిచిన వారంలో కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో చోటు చేసుకున్న ముష్కర దాడిలో 8 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అయితే సోమవారం అనంతనాగ్ జిల్లాలోని ఓ మార్కెట్ ప్రాంతానికి తన రోజువారీ డ్యూటీకి వెళ్ళిన అబ్దుల్ రషీద్ పీర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేని కుమార్తె జోహ్రా తీవ్ర దుఃఖానికి లోనవుతుంటే ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చిన అధికారుల కళ్లు చమర్చాయి. "మా నాన్న ఏ తప్పూ చేయలేదు. ఆయన్ను ఎందుకు చంపారు? నాన్నను తలచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన్ను హత్యచేసిన వారు శిక్షించబడాలి" అని జోహ్రా అక్క అక్కడికి వచ్చిన అధికారులతో చెప్పింది. ఈ విషాద సంఘటన తెలుసుకున్న దక్షిణ కాశ్మీర్ పోలీస్ డీఐజీ "నీ కన్నీరు ఎంతో మంది హృదయాలను తాకుతోంది. ప్రతి కన్నీటి చుక్కా ప్రతీకారేచ్ఛను రిగిలిస్తోంది. నీ తండ్రి ఓ నిజమైన పోలీసు అధికారి. డ్యూటీ చేస్తూ త్యాగం చేసిన అమరజీవి. బాధపడకు" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో పాటూ జోహ్ర కన్నీటి పర్యాంతమైన ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. బంధుమిత్రుల, సైన్యాధికారుల సమక్షంలో వీర జవాన్ అబ్దుల్ రషీద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.