సీఎం జగన్ జెరూసలేం టూర్.. ఇజ్రాయెల్ రైతులతో ప్రత్యేకంగా భేటీ!

SMTV Desk 2019-08-03 14:34:24  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం(ఇజ్రాయెల్) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇజ్రాయెల్ రైతులతో సమావేశమయ్యారు. తక్కువ నీటితో అత్యధిక దిగుబడి సాధించేదిశగా ఇజ్రాయెల్ రైతులు అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.



కాగా, తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న విజయవాడకు తిరిగి రానున్నారు. నీటి పొదుపు, పునర్వినియోగం విషయంలోఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎడారిలో ఉన్నప్పటికీ తక్కువ నీటితో భారీ స్థాయిలో దిగుబడిని సాధిస్తోంది.