మెగాస్టార్ సినిమాలో కూడా అనసూయ!!

SMTV Desk 2019-08-03 14:33:51  

మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా’ పూర్తయింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్దిగా, ఆయన గురువు పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. నయనతార, జగపతిబాబు, కిచ్చ సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా, అనుష్క తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండనుంది. మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న సినిమా ప్రారంభం కానుంది. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో సినిమా ఉండనుందని తెలుస్తొంది. ఇందులో చిరు డబుల్ యాక్షన్ చేస్తారట. జబర్డస్ట్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. అంతేకాదు.. రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.