సింగల్ టేక్ బాసు!!

SMTV Desk 2019-08-03 14:32:57  

యంగ్ హీరో నాగశౌర్య రిస్కీ యాక్షన్స్ సీన్స్ చేయబోయే గాయడిన సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్నసినిమాకి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. ఈ చిత్రానికి “అశ్వద్ధామ” పరిశీలనలో ఉంది. ఇందులో 3 నిమిషాల యాక్షన్ సన్నివేశం ఒకటి ఉండబోతోంది.

ఆ సింగిల్ టేక్ యాక్షన్ సీన్ లో నటించబోయే నాగశౌర్య ప్రమాదానికి గురయ్యాడు. కోలుకొని మళ్లీ అవే యాక్షన్ సీన్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న అన్బు అరివు, ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు.

‘డియర్ కామ్రేడ్’ సినిమాలో సింగిల్ టేక్ లో ఓ సాంగ్ తీశారు. అదే క్యాంటీన్ సాంగ్. ‘కొబ్బరిమట్ట’ సినిమాలో ఏకబిగిన 3 నిమిషాల డైలాగ్ చెప్పాడు సంపూ. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాలోనైతే 10 నిమిషాల క్లైమాక్స్ సీన్ ను సింగిల్ కట్ లో తీశారు. ఇప్పుడు అలాంటిదే మరో సింగిల్ టేక్ షాట్ తెరపైకి రాబోతోంది.