'జనసేన పార్టీ' పత్రిక ఆహ్వానం!

SMTV Desk 2019-08-03 14:32:10  

జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ గళాన్ని వినిపించేందుకు ఓ పత్రికను తీసుకురావాలని నిర్ణయించారు. తాజాగా ఇందుకోసం పనిచేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లను ఆహ్వానిస్తూ జనసేన ఓ ప్రకటనను జారీచేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో పత్రిక కోసం పనిచేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లు కావాలని జనసేన కోరింది.

ఫీచర్ కంట్రిబ్యూటర్లుగా పనిచేసేందుకు ఎన్నారైలు కూడా అర్హులేనని చెప్పింది. అభ్యర్థులు ఏదైనా సామాజిక సమస్యను ఎంచుకుని రెండు పేజీలకు మించకుండా వ్యాసాన్ని రాసి jspmagazine@gmail.comకు పంపాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులకు తాము సమాచారం అందిస్తామని పేర్కొంది. ఈ లేఖతో పాటు తమ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ను పొందు పరచాలని జనసేన పార్టీ చెప్పింది. ఈ మేరకు జనసేన ఈరోజు ఓ ట్వీట్ చేసింది.