స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త

SMTV Desk 2019-08-01 15:23:27  

సిటీలో ప్రతి వంద మందిలో 95 మంది సెల్ లేదా కంప్యూటర్ లోనే అధిక సమయం గడుపుతున్నారు.అవసరమున్నా లేకపోయినా.. టైం పాస్‌ నుంచి వ్యసనంగా తయారైంది. ఇంటర్నెట్ వ్యసనంలోదేశంలోనే సిటీ 4వ స్థానంలో ఉంది. రోజురోజుకు ఇంటర్నెట్ అతిగా వాడే వ్యసనానికి అలవాటుప-డుతున్న వారు పెరుగుతున్నా రు. మరోవైపు ప్రతిఏడాది ఇంటర్నెట్ వ్యసనానికి గురవుతున్న వారి వయసు తగ్గుతుం ది. ఈ వ్యసనం అధికంగా 16ఏళ్లకు పైబడిన వారిలోనే ఎక్కువ ఉంది. ఇంటర్నెట్కు అడిక్ట్ అయిన వారిలో 12 ఏళ్లు ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని ‘వరల్డ్ అసోసియేషన్ ఫర్ సైకో సోషల్ రిహాబిలిటేషన్’ సంస్థ పరిశోధనలో తేలింది .

రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో కూడాఇంటర్నెట్ అతి వినియోగం వల్ల 37 శాతం మందిటీనేజ్ మానసిక సమస్యలకు గురవుతున్నారు. 13–15 ఏళ్ల మధ్య ఉన్నవారు అధికంగా వీడియోగేమ్స్ కు అడిక్ట్ అయ్యారు. 15 –17 ఏళ్ల మధ్యఉన్న వారు ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలోరోజుకు దాదాపు 10 గంటలకు పైగా చూస్తున్నారు.ఈ వ్యసనంతో కేవలం మానసికంగానే కాకుండామెటబాలిక్ సమస్యలు కూడా వస్తున్నాయని సర్వేలోవెల్లడైంది. 18 –25 ఏళ్ల మధ్య ఉన్న కొంతమందియువతపై చేసిన స్టడీలో యువతులు ఎవరూసైబర్ సెక్సువల్ అడిక్షన్ కు గురవలేదని తెలపగా,పురుషులు మాత్రం 57 శాతం మంది తాము రెగ్యూ -లర్ గా పోర్న్ వీడియోలు చూస్తున్నట్లు చెప్పారు.