సిద్ధార్థను నేను కలిశా..ఆయనొక జెంటిల్మెన్..కేటీఆర్

SMTV Desk 2019-07-31 14:21:13  ktr, siddarth,

కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయవేత్తలు, వాణిజ్యవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేసారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేస్తూ..’వీవీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన వార్తతో షాక్‌కు గురయ్యాను. ఎంతో బాధగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం కలిగింది. ఆయన ఒక జెంటిల్మెన్. ఈ కష్ట సమయాల్లో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, కాఫీ డే సిబ్బంది ధైర్యంగా ఉండాలి’ అన్నారు.