వైద్యుల నిర్లక్ష్యం వల్ల తల్లి, బిడ్డ మృతి

SMTV Desk 2017-08-30 13:21:20  rajasthan, jodhpur hospital, neglect of doctors, umed hospital

రాజస్థాన్, ఆగస్ట్ 30: వైద్యులను దేవుళ్ళతో పోలుస్తారు అటువంటి అత్యంత బాధ్యతయుతమైన వృత్తి వారిది. కానీ ఆ విషయాన్నీ మర్చిపోయారు రాజస్థాన్‌లోని వైద్యులు. తాము ఎక్కడ ఉన్నామో అన్న సంగతి కూడా మర్చిపోయి వ్యవహరించారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్ లోని జోద్ పూర్ ఉమేద్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తర ప్రదేశ్‌లోమి ఓ గర్భిణి స్త్రీ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో మహిళ పరిస్థితి దృష్ట్య ఆపరేషన్ అవసరమని భావించి ఆమెను శస్త్ర చికిత్సా గదికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యుల మధ్య చోటు చేసుకున్న చిన్న వాగ్వివాదం కాస్తా తీవ్ర రూపం దాల్చి మహిళను నిర్దాక్షిణ్యంగా అలా వదిలేసి వైద్యులు ఒకరిని ఒకరు తీవ్రంగా తిట్టుకున్నారు. దీంతో అప్పటికే ఆందోళనకరంగా ఉన్న ఆమె పరిస్థితి విషమించడంతో తల్లి, బిడ్డ కన్నుమూశారు. ఈ ఘటన పై బాధితురాలి బంధువులు కన్నిమున్నిరై విలపిస్తూ ఆసుపత్రి యాజమన్యంపై ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషాద ఘటనకు బాధ్యులైన వైద్యులను యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.