మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపిస్తా

SMTV Desk 2019-07-31 14:20:19  

జగన్‌రెడ్డి గారూ.. మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపిస్తా అని సవాల్‌ విసిరారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ప్రశ్నించారు.
ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యంపై పత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసిన కేశినేని.. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కుంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలని ఏ రకంగా పరిష్కరిస్తారు జగన్ రెడ్డి గారు..? అని ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపిస్తా అని అంటూనే మీరు నిమ్మగడ్డ ప్రసాద్‌ వ్యవహారం చూసుకోవచ్చు అని సెటైర్‌ వేశారు.