సిద్ధార్థలాగే నన్నూ వేధిస్తున్నారు..విజయ్‌మాల్యా

SMTV Desk 2019-07-31 14:17:10  vijay malya,

కాఫీ డే వ్యవస్థాపకులు, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం.కృష్ణ అల్లుడు సిద్ధార్థ అంశంపై విజయ్ మాల్యా స్పందించారు. సిద్దార్థ చావు ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనమని ఆరోపించారు మాల్యా. తనని కూడా అలాగే వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు మాల్యా ట్వీట్ చేసాడు. తనకు సిద్ధార్థతో పరోక్ష సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సిద్దార్థ మంచి వ్యక్తి అని, తెలివైన వ్యాపారవేత్త అని అన్నారు. సిద్దార్థ రాసిన లేఖను చూసి నేను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ప్రభుత్వ ఏజేన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశలోని నెట్టగలవన్నారు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ..నా విషయంలో వారెలా వ్యవహరిస్తున్నారో చూడండని తెలిపారు. మాల్యా బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల అప్పు ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.