ట్రెండ్ అవుతున్న RIPactorvijay హ్యాష్ ట్యాగ్‌

SMTV Desk 2019-07-30 14:39:14  

ఒక్కోసారి సినీ నటుల అభిమానుల వికృత చేష్ట‌లు సదరు హీరోలను చిక్కుల్లో పడేస్తాయి. తాజాగా తమిళ నటుడు అజిత్‌కు తన అభిమానులు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టారు. అజిత్ అభిమానులు నటుడు విజయ్ చనిపోయాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

RIPactorvijay అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అజిత్ అభిమానులు చేసిన ప‌నికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశమై క్రికెట‌ర్ రవిచంద్ర‌న్ అశ్విన్ కూడా మండిప‌డ్డారు. బ‌తికి ఉన్న యాక్ట‌ర్‌ని చ‌నిపోయిన‌ట్టు ప్ర‌చారం చేసే ధోర‌ణి బాధ‌ని క‌లిగిస్తుంద‌ని త‌న ట్వీట్‌లో అశ్విన్ పేర్కొన్నారు. ఈ వివాదం మ‌రింత ముద‌ర‌క‌ముందే అజిత్ స్పందించి ఈ ప్ర‌చారానికి అడ్డుక‌ట్టు వేయాల‌ని కొంద‌రు కోరుతున్నారు.