సైరా రిలీజ్ కు కష్టాలు

SMTV Desk 2019-07-30 14:38:35  syeraa,

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా చేస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2న రావడం కష్టమే అంటున్నారు.

పిరియాడికల్ మూవీ కాబట్టి సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ బాగా చేస్తున్నారు. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అనుకున్న టైం కు పూర్తయ్యే అవకాశం లేదట. దానికే చాల టైం పట్టేట్టు ఉందని తెలుస్తుంది. అందుకే అనుకున్న టైంకు సైరా రిలీజ్ రావడం కష్టమని అంటున్నారు. ఒకవేళ సైరా ఆ డేట్ మిస్సైతే సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సినిమా ఇప్పటికే పొంగల్ రిలీజ్ ఎనౌన్స్ చేశాయి. మరి సైరా అఫిషియల్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నద్ తెలియాలంటే అగష్టు 22 చిరు బర్త్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.