రైలు కిందపడి ఆర్మీ అధికారి ఆత్మహత్య

SMTV Desk 2019-07-30 14:36:32  

ఢిల్లీ: ఆర్మీ అధికారి మృతదేహం రైలు పట్టాలపై లభించిన సంఘటన పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైలు పట్టాలపై మృతదేహం కనిపించడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని పరిశీలించగా కెప్టెన్ దివాకర్ పురిగా గుర్తించారు. దివాకర్ ఆర్మీ మెడికల్ కార్పొరేషన్‌లో డాక్టర్ గా పని చేసినట్టు సమాచారం. దివాకర్ లక్నో నుంచి ఢిల్లీ రాగానే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.