బంగీ జంప్లో తాడు తెగి 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు...వైరల్ వీడియో

SMTV Desk 2019-07-26 15:40:59  

బంగీ జంప్ గురించి తెలుసు కదా. పైనుంచి తాడుతో ఒక్కసారిగా కిందికి దూకడం. ఎంతో త్రిల్లింగ్ గా ఉండే ఈ సాహసం చేయాలంటే గుండెధైర్యం చాలానే ఉండాలి. కాని పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణం పోవాల్సిందే. తాజాగా ఇదే తరహాలో ఓ సంఘటన చోటుచేసుకుంది. పోలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. 200 మీటర్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. నేరుగా కిందపడ్డాడు. గ్డినియాలోని ర్యాడీ యూరోఫియా థీమ్ పార్క్‌లో ‘ది బంగీ క్లబ్’ సంస్థ భారీ క్రేన్‌తో 200 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బంగీ జంప్‌కు 39 ఏళ్ల వ్యక్తి సిద్ధమయ్యాడు. పైకి వెళ్లిన తర్వాత కాళ్లకు తాళ్లు కట్టుకుని దూకాడు. అయితే, అతడి కాలికి కట్టిన తాడు బకిల్ ఊడిపోవడంతో 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. అయితే, కింద పెద్ద బెలూన్‌ను ఏర్పాటు చేయడంతో దానిపై పడి, కిందకి జారిపోయాడు. తల కిందకి ఉండటం వల్ల మెడ ఎముక విరిగింది. ఈ ఘటన తర్వాత వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ‘ది బంగీ క్లబ్’ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘పోలాండ్‌లో బంగీ జంప్ నిర్వహించే ఏకైక సంస్థ మాదే. గత 19 ఏళ్లులో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు. బంగీ జంప్ చేసేవారు గాయపడకుండా స్కొకొక్రాన్ పిల్లోస్ వాడుతున్నాం’’ అని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.