ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయం

SMTV Desk 2019-07-26 15:34:03  vijay sethupathi

ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. డార్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథను సినిమాగా తెరకెక్కించడం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ఇందులో ముత్తయ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్‌ మాట్లాడుతూ ‘నా బయోపిక్ రానుందనే విషయం వింటేనే చాలా ఆనందంగా ఉంది. 2020లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌సేతుపతి వంటి మేటి నటుడు నా పాత్ర పోషించడం మరింత గౌరవంగా ఉందని’ అన్నారు. విజయ్‌ సేతుపతి స్పందిస్తూ ‘మురళీధరన్‌ పాత్రలో నటించడం కెరీర్‌లోనే ఓ గొప్ప విషయం. చాలా గౌరవంగా భావిస్తున్నా. వాస్తవానికి ఆయన పాత్ర పోషించడం సవాలుతో కూడుకున్న విషయమని’ పేర్కొన్నారు. ఈ సినిమా తమిళంలో కూడా విడుదల కానుంది.