కార్గిల్ యుద్ధం సమయంలో మోడీ ఏం చేశారో తెలుసా?

SMTV Desk 2019-07-26 15:30:34  

కార్గిల్ వార్ జరిగి 20 సంవత్సరాలైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని అరుదైన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కార్గిల్‌ యుద్ధం జరిగిన సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లో పార్టీ తరఫున మోడీ పనిచేశారు. కార్గిల్‌లో యుద్ధం ముగిసిన కొన్ని రోజులకు మోడీ అక్కడికి వెళ్లి జవాన్లతో ముచ్చటించారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అభినందించారు. ఆ మధుర స్మృతులను ఇవాళ మోడీ గుర్తుచేసుకున్నారు. అప్పటి ఫొటోలను కూడా షేర్‌ చేశారు.