అవతార్‌ ను దాటేసిన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్

SMTV Desk 2019-07-24 16:12:28  Avatar, avengers,

అభిమానులు, నిర్మాతలు, సూపర్ హీరోస్‌, యావత్ సినిమా ప్రపంచం ఊహించే నిజమైంది. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమా అవతార్‌ ను దాటేసింది. అయితే తొలిసారి విడుదలయిన అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ లో దాటలేదు. రెండోసారి రీరిలీజ్‌ చేసిన అవెంజర్స్ ఎండ్‌ గేమ్‌ తో అవతార్‌ ను బీట్‌ చేయడం సాధ్యమైంది. గత ఏప్రిల్‌ 26న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్‌ అయిన అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌ చిత్రం రెండు రోజుల్లోనే రూ.2.30 వేల కోట్లు సాధించి బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. దీంతో ప్రేక్షకులతో పాటు అవెంజర్స్‌ సూపర్ హీరోస్‌, దర్శకుడు, నిర్మాతలు అందరూ అవతార్‌ ను దాటేస్తుందనుకున్నారు.

కానీ అవెంజర్స్‌ విడుదలైన కొన్ని రోజుల తర్వాత వసూళ్లు అనూహ్యంగా తగ్గిపోయాయి. అవతార్ కంటే 45 మిలియన్ డాలర్లు తక్కువ కలెక్ట్ చేసింది ఎండ్‌గేమ్‌. ఎలాగైన అవతార్‌ చిత్రాన్ని దాటేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో కొన్ని సీన్లకు వీఎఫ్‌ఎక్స్‌ జోడించి ప్రత్యేకంగా కొన్ని ఎక్స్‌ ట్రా సీన్స్‌ ను యాడ్‌ చేసి మళ్లీ రీరిలీజ్‌ చేశారు చిత్రబృందం. దీంతో చిత్రం విడుదలైన 86 రోజుల తర్వాత ఎట్టకేలకు అవతార్‌ ను బీట్ చేసింది అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ చిత్రం. ఈ నెల 21న 2.79 బిలియన్ డాలర్లతో అవతార్‌(2.78 బిలియన్ డాలర్లు)ను దాటేసింది. దీంతో అవెంజర్స్‌ మూవీ టీమ్‌కు అవతార్ సృష్టికర్త జేమ్స్ కెమరూన్ అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌ లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల వైపుగా ఎండ్‌ గేమ్‌ దూసుకెళ్తోంది.

కాగా 2009లో విడుదలైన అవతార్‌ చిత్రం సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. 2.78 బిలియన్ డాలర్లు వసూలు చేసిన అవతార్ రికార్డును అందుకోవడం పదేళ్లలో ఏ ఒక్క చిత్రానికి సాధ్యం కాలేదు.