హైదరాబాద్‌లో విప్రో ల్యాబ్‌!

SMTV Desk 2019-07-24 16:09:21  

ప్రముఖ టెక్ సంస్థ విప్రో త్వరలో హైదరాబాద్‌లో డిజిటల్‌ ప్రొడక్ట్‌ కంప్లియన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినియోగదారుల నమ్మకం, భద్రతను చూరగొనేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆటోమోబైల్‌, రక్షణ, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, వైమానిక రంగం, టెలికామ్‌, మెడికల్‌, ఎనర్జీ, తయారీ రంగాల్లోని వినియోగదారులకు సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.