అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమాకి టైటిల్.. 'నాన్న.. నేను'

SMTV Desk 2019-07-24 16:05:23  

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తండ్రీ కొడుకుల అనుబంధానికి సంబంధించిన కథా వస్తువుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి నాన్న.. నేను అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నారు. ఈ టైటిల్ నే ఖరారు చేశారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే, మరో కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్ర కోసం ఖడ్గం సంగీతను తీసుకున్నారని చెబుతున్నారు. గతంలో త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన జులాయి .. సన్నాఫ్ సత్యమూర్తి హిట్ కావడంతో, తాజా చిత్రంతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.