పాపాయిని ఆహ్వానిస్తూ జుక‌ర్‌బ‌ర్గ్ దంపతుల లేఖ..

SMTV Desk 2017-08-30 11:52:16  FACEBOOK, MARK ZUCKERBERG, PRISCILLA CHAN, WELCOME THEIR SECOND DAUGHTER.

ముంబై, ఆగస్ట్ 30 : ఫేస్‌ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఇంట్లోకి మరో బుల్లి పాపాయి అడుగు పెట్టింది. జుక‌ర్‌బ‌ర్గ్ భార్య ప్రిసిల్లా చాన్‌ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్‌ బుక్‌ ద్వారా వెల్లడించారు. వీరికి 2015లో మొదటి కూతురు మాక్సిమా పుట్టినప్పుడు కూతుర్ని ఈ లోకంలోకి ఆహ్వానిస్తూ తల్లిదండ్రులిద్దరూ ఓ లేఖ రాసిన విషయం అప్పట్లో ఒక సెన్సేషన్. అలాగే ఇప్పుడు కూడా ఈ పాపను ఆహ్వానిస్తూ ఒక లేఖ రాశారు. "పాపగా ఉండే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నీ పసి వయసును ఆస్వాదించు. నీ భవిష్యత్తును గురించి చింతించే అవకాశాన్ని మాకివ్వు, నీలాంటి పిల్లల కోసం ప్రపంచాన్ని గొప్పగా మార్చే అవకాశాన్ని ఇవ్వు" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మార్క్ దంపతులు కూతురితో దిగిన ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.