చెన్నైలో ATM...ఎనీ టైం మెడిసిన్!

SMTV Desk 2019-07-18 15:41:29  

చెన్నై సర్కార్ ప్రజలఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ వినూత్న ప్రయత్నం చేసింది. ఇక నుండి చెన్నైలోని ఆసుపత్రుల్లో ఎటిఎంల లాంటి యంత్రాలను ఏర్పాటు చేసింది అక్కడి సర్కార్. ప్రభుత్వం నిర్వహిస్తున్న 23 మెడికల్‌ కాలేజీ ఆసుపత్రులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటూ, మొత్తం 32 చోట్ల ఇలాంటి యంత్రాల్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ యంత్రం ద్వారా టిబి, డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ వంటి 32 రకాల జబ్బులకు మందులు పొందవచ్చు. మెడికల్‌ షాపుల ముందు లైనులో నిలబడే పనిలేకుండా ఈ యంత్రాల ద్వారా అత్యంత త్వరగా, తేలిగ్గా కావాల్సిన మందులను పొందేందుకు అవకాశముంది.మనకు కావాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. మందులు కావాలనుకునే వారు ఈ కోడ్‌ని యంత్రానికి చూపించాల్సి ఉంటుంది. యంత్రం ఆ కోడ్‌ని స్కాన్‌ చేసి ఎన్ని మందులు కావాలో అడుగుతుంది. ఎంత డబ్బు అవుతుందో చెబుతోంది. ఆ డబ్బు ఇవ్వగానే వెంటనే మందులు ఇచ్చేస్తుంది. ఈ యంత్రానికి రూ.80లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం 32 యంత్రాల్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత మందులను సమస్యలు ఉన్న అందరూ వాడాలన్న ఆయన ఈ యంత్రాల ద్వారా ఆ మందులను కూడా పొందవచ్చని తెలిపారు.