ఒకే రోజులో 8 లక్షల డాలర్లు ఖర్చు!

SMTV Desk 2019-07-17 12:27:36  najeeb razak

మలేసియ మాజీ ప్రధాని నజీబ్ రజాక్ ఒకే రోజు ఏకంగా 8,00,000 డాలర్లను నగదును ఖర్చు చేశాడని కోర్టు విచారణలో తేలింది. నజీబ్ రజాక్ ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి మలేసియా సావరిన్ వెల్త్ ఫండ్ ఎండిబి నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు దొంగిలించినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ కుంభకోణం వల్లే గత ఎన్నికల్లో నజీబ్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. పదవీచ్యుతుడైన తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో ఆ కుంభకోణంపై విచారణ జరిగింది. ఈ కేసుపై సోమవారం నాటి విచారణలో ఒక బ్యాంక్ అధికారి మాట్లాడుతూ మాజీ ప్రధానికి చెందిన రెండు క్రెడిట్ కార్డులను ఉపయోగించి, ఇటలీలోని స్విస్ జెవెలర్ డి గ్రిసోగోనోలో 3.3 మిలియన్‌ల రింగిట్ (మలేసియా కరెన్సీ) లు అంటే 8,03,000 అమెరికన్ డాలర్ల సొమ్మును ఖర్చు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వార్తాసంస్థ బిర్నామా వెల్లడించింది. ఈ భారీ మొత్తాన్ని 2014 ఆగస్ట్ 8న ఖర్చు చేశారని మలేసియా లెండర్ యాబ్యాంక్ సీనియర్ అధికారి ఎవోహ్ ఇంగ్ లియోంగ్ చెప్పారు. అయితే ఆ సొమ్ముతో ఏం కొన్నారనేది ఆయన వెల్లడించలేదు. హవాయిలోని చానెల్ బొకిక్‌కు 4,60,000 రింగిట్‌లు, బ్యాంకాక్‌లోని షాంగ్రిలా హోటల్‌కు 1,20,000 రింగిట్‌ల నగదు చెల్లించేందుకు కూడా ఈ కార్డులనే వాడారు.