బెల్లి డాన్స్ తో మతిపోగొడుతున్న బాహుబలి బ్యూటీ

SMTV Desk 2019-07-13 12:25:14  nora fateh, belly dance, john abraham

బట్లా హౌస్.. జాన్ అబ్రాహం హీరోగా చేసిన మూవీ ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది.


ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ బాహుబలి దగ్గరకి వెళదాం.. బాహుబలి సినిమాలో మనోహరి అనే ఐటెం సాంగ్ ఉంది. అందులో నోరా ఫతేహ్ నర్తించింది. తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు ఈ విదేశీ భామ బాలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కొత్త కొత్త ఐడియాలతో వేడి పుట్టిస్తుంది.ఈ అమ్మడు బట్లా హౌస్ లో ఓ సఖి సాఖీరే అనే ఐటెం సాంగ్ చేసింది. ఇందులో బెల్లి డ్యాన్స్ తో ఇరగదీసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నది.