తృణమూల్ కాంగ్రెస్ నేత సోఫియుల్ హసన్ హత్య

SMTV Desk 2019-07-13 12:23:13  

తృణమూల్ కాంగ్రెస్ నేత సోఫియుల్ హసన్ ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన ప్రస్తుతం హమైపూర్ గ్రామ పెద్దగా ఉన్నారు. సోఫియుల్ హరిహర్‌పర వెళ్తుండగా ముర్షిదాబాద్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయన హత్య వెనక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ హత్య వెనక బిజెపి నేతల హస్తం ఉందని టిఎంసి నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొంత కాలంగా టిఎంసి నేతలపై దాడులు పెరిగాయి. హుగ్లీ జిల్లాలో స్థానిక నేతను కిరాతకంగా హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారు. ముర్షిదాబాద్‌లో టిఎంసి కార్యకర్తల ఇళ్లపై దుండగులు జరిగిన బాంబు దాడిలో ముగ్గురు కార్యకర్తలు మృత్యువాత పడ్డారు. అయితే, తాజా సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.