ఉత్తరప్రదేశ్‌లో మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు

SMTV Desk 2019-07-13 11:52:13  rains,

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు 15 మందితో పాటు 23 జంతువులు మృత్యువాత పడ్డాయి. యుపిలోని 14 జిల్లాలో గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల దాటికి 133 భవనాలు కుప్పకూలిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నేటి నుంచి మరో ఐదురోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక, గోవా, కొంకణ తీర ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరంలలో కూడా శనివారం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యుపి సర్కార్ హెచ్చరించారు.