అతడు పురుషుడా..? లేక మహిళా..?

SMTV Desk 2019-07-13 11:51:32  

మహారాష్ట్ర: వైద్యులు ఓ పురుషుడి శరీరంలో గర్భసంచి కనుగొన్న అరుదైన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. పెళ్లై రెండేళ్లయినా (29) ఏళ్ల వ్యక్తి తనకు పిల్లలు పుట్టడం లేదని ముంబయి జెజె ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పురుషుడికి అక్కడి వైద్యులు విస్తుపోయే విషయాన్ని చెప్పారు. అతడి శరీరంలో గర్భసంచి ఉందని తెలియడంతో డాక్టర్లు షాక్ అయ్యారు. జీర్ణాశయానికి అతుక్కుని అండాశయాలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో అతడు పురుషుడా..? లేక మహిళా..? అనే దిశగా వైద్యులు తదుపరి పరీక్షలు నిర్వహించారు.

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం… అతడు లింగపరంగా పురుషుడే. శస్త్రచికిత్సల ద్వారా గర్భసంచిని తొలగించాం. ఆ తర్వాత నిర్వహించిన మరో శస్త్రచికిత్స ద్వారా అతడి వృషణాల్లో అండాశయాలను పంపించాము. జెజె ఆస్పత్రిలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు. అయితే, పురుషుల్లో గర్భసంచి ఉన్న సంఘటనలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 కేసులు వెలుగుచూశాయని వైద్యులు తెలిపారు.