చేప కోసం గేలం వేస్తే బోనస్‌గా పాము...వైరల్ వీడియో

SMTV Desk 2019-07-11 14:52:26  man get fish with snake in fishing texas wild boy

చేపలు పట్టడానికి వెళ్ళిన ఓ వ్యక్తికి బంపర్ ఆఫర్ తగిలింది. చేపల కోసం గేలం వేసిన ఓ వ్యక్తికి చేపతోపాటు బోనస్‌గా పాము కూడా వచ్చింది. దీంతో ఆ వ్యక్తి షాకవ్వడమే కాదు.. ఆ పాము నోట్లో చేపను ఎలా తీసుకోవాలనే ఆలోచనలో పడ్డాడు. టెక్సాస్‌లోని హౌస్టన్‌, లూసియానా ప్రజలకు చేపలు పట్టడం హాబీ. అక్కడ ఉదయం లేవగానే దగ్గర్లోని సరస్సులు, నదులు, చెరువులకు గేలాలతో బయల్దేరుతారు. ఓ యువకుడు ఎప్పటిలాగానే ఓ నదీ తీరానికి వెళ్లి చేపల కోసం గేలం వేశాడు. గేలానికి బరువుగా ఏదో తలగడంతో చేప చిక్కుకుందని భావించాడు. దీంతో గేలాన్ని పైకి లాగాడు. అతడు ఊహించినట్లే చేప వచ్చింది. కానీ.. దాన్ని పట్టుకుంది గేలం కాదు, ఆ గేలానికి చిక్కుకున్న పాము. ఆ పామును చూడగానే అతడి ఆశలు నీరుగారాయి. ఈ సందర్భంగా అతడు పెట్టిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియోను ‘టెక్సాస్ వైల్డ్ బాయ్’ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. గేలానికి పాము చిక్కుకున్నా అతడు చాలా ధైర్యంగా ఉన్నాడని, అదే తామైతే గేలాన్ని అక్కడే పడేసి పరిగెట్టేవాళ్లమని కామెంట్ చేస్తున్నారు.