సినిమా ప్రమోషన్‌ చేసిన నటి... నెటిజన్ల మండిపాటు, కేసు నమోదు!!

SMTV Desk 2019-07-06 13:05:44  

ప్రముఖ మలయాళ నటి ఆశా శరత్ గుర్తుందా? అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి లో పోలీసు అధికారిణిగా మరో ప్రధాన పాత్రలో నటించిన నటి. ఆమె ఇప్పుడు ఓ ఫేక్ వీడియోను పెట్టి కష్టాల్లో పడింది. మేకప్ లేకుండా, తన భర్త అదృశ్యం అయ్యారని, ఆయన ఇప్పుడు కనిపించడం లేదని, ఆచూకి తెలిసిన వారు కట్టప్పన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో తెలియజేయాలని కోరుతూ వీడియో పెట్టగా, అది క్షణాల్లో వైరల్ అయింది. మాలీవుడ్ ఫ్యాన్స్ ఆమె భర్త అదృశ్యం అయ్యారని నమ్మారు. ఎంతో మంది స్పందించారు. విషయం సీరియస్ గా మారుతుండటంతో, అది ఫేక్ వీడియో అని, తన భర్త అదృశ్యం కాలేదని, తాను నటించిన ఎవిడే చిత్రం ప్రమోషన్‌ లో కోసం ఆ వీడియో పెట్టానని ఆశా శరత్ చెప్పారు. దీంతో ఆమె చేసిన పనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడగా, ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేసినందుకు ఆమెపై పోలీసు కేసు నమోదైంది.