నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.

SMTV Desk 2019-07-06 13:01:48  

బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్‌ రానున్నారు. దేశవ్యాప్తంగా నేటి నుంచి బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అమిత్ షా నేడు హైదరాబాద్‌ వస్తున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు అమిత్ షా డిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడే సీఐఎఎస్ఎఫ్ అధికారులతో సమావేశం అవుతారు.

ఆ తరువాత శంషాబాద్ సమీపంలో రంగనాయకుల తండాలో నివశిస్తున్న గిరిజన మహిళా సోనీ నాయక్ ఇంటికి వెళ్ళి ఆమెకు తొలి సభ్యత్వం ఇస్తారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు నోవాటెల్ హోటల్లో రాష్ట్ర బిజెపి నాయకులతో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తరువాత వారితో కలిసి విందు భోజనం చేసి రాత్రి 9 గంటలకు మళ్ళీ డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.