బడ్జెట్ ఎఫెక్ట్...టాప్ స్పీడ్ లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

SMTV Desk 2019-07-05 11:49:46  Sensex, Nifty, Stock market, Share markets

నేడు పార్లిమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు అధికలాభాలతో దూసుకేల్తోంది. సెన్సెక్స్ మళ్లీ 40,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. సెన్సెక్స్ ఉదయం 9:53 సమయంలో 89 పాయింట్ల లాభంతో 39,997 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ23 పాయింట్ల లాభంతో 11,969 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 117 పాయింట్ల లాభంతో 40,025 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11,979 పాయింట్లను తాకింది. నిఫ్టీలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఎల్అండ్‌టీ, హెచ్‌యూఎల్, యూపీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదేసమయంలో యస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, వేదాంత, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్ షేర్లు నష్టా్లలో కదలాడుతున్నాయి.