తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు రేపే

SMTV Desk 2019-07-05 11:43:42  ssc results,

తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శనివారం విడుదల చేయబోతున్నామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల కమీషనరేట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. గత నెల 10 నుంచి 24 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,431 మంది విద్యార్దులు హాజరయ్యారని సుధాకర్ తెలిపారు.