నేడు పార్లమెంటులో కేంద్రబడ్జెట్

SMTV Desk 2019-07-05 11:42:29  budjet,

భారత్‌ తొలి మహిళా ఆర్ధికమంత్రినిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆమె పారిశ్రామిక, వ్యవసాయ, మౌలికవసతుల కల్పన రంగాలకు ప్రాముఖ్యత కల్పించనున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి వేతన జీవులకు ఉపశమనం కలిగించేందుకు ఆదాయపన్ను పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగాల కల్పనలో మోడీ ప్రభుత్వం అశ్రద్ద చూపుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నందున ఈసారి బడ్జెట్‌లో భారీగా ఉద్యోగాల కల్పనకు దోహదపడే ప్రాజెక్టులు లేదా కార్యక్రమాలను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబందించిన పెండింగ్ ప్రాజెక్టు పనులకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను బట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపొందించుకోవాలని ఎదురుచూస్తోంది. ఈరోజు వాటిపై పూర్తి స్పష్టత వస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే బడ్జెట్‌ను సిద్దం చేసుకొని అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంది.