'ఆర్‌ఆర్‌ఆర్‌' కి బ్రేక్ పడిందా?

SMTV Desk 2019-07-05 11:41:38  

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కీలక పాత్రధారులుగా భారీ బడ్జెట్‌తో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ (వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌కి దర్శకుడు రాజమౌళి కాస్త విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత పనులతో అమెరికా వెళ్లారు. "మా భీమ్‌, రామరాజు ఎనర్జీతో షూటింగ్‌ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. తాత్కాలికంగా షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చాం. మళ్లీ వారంరోజుల్లో ఫుల్‌స్వింగ్‌తో పనిచేస్తాం" అని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ఇటీవల సినిమాలో కీలకమైన యుద్ధ ఘట్టాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్న అలియా భట్‌, మరో కీలక పాత్ర పోషించనున్న అజయ్‌ దేవగణ్‌ త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో అడుగుపెడతారు.