ఒకే అంశంతో రెండు సినిమాలు!!

SMTV Desk 2019-07-04 11:54:39  

వెంకటేశ్, ప్రభాస్ కొత్త చిత్రాలు ఒకే తరహా పాయింట్‌తో తెరకెక్కుతున్నాయట. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య... రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం వెంకీమామ . బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జ్యోతిషం నేపథ్యంలో ఉంటుందని టాక్. మామకు అల్లుడి వల్ల గండం ఉండడం అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని టాక్. అయితే, ఈ వ్యవహారమంతా ఫన్నీగా సాగుతుందని అంటున్నారు.

వెంకీమామ తరహాలోనే మరో సినిమా కూడా జ్యోతిషం చుట్టూ తిరుగుతుందట. ఆ చిత్రమే ప్రభాస్ పిరియాడికల్ లవ్ స్టోరీ. జిల్ రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ సినిమాలో జ్యోతిషంతో పాటు హస్త సాముద్రికం అనే అంశం కూడా కీలక పాత్ర పోషిస్తుందట. అలాగే వెంకీమామ తరహాలోనే ఒకరి వల్ల మరొకరికి గండం ఉండడం అనే పాయింట్ కూడా ప్రభాస్ సినిమాలో ఉంటుందని సమాచారం. మరి ఒకే తరహా అంశాలతో వేర్వేరు జానర్స్‌లో వస్తున్న వెంకీ, ప్రభాస్... బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.