తానా వేడుకలు ప్రారంభం

SMTV Desk 2019-07-04 11:53:54  tana celebrations 2019

గురువారం (జూలై 4) నుండి అమెరికాలో తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలకు వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. అయితే ఈ సభలకు ముఖ్యఅతిథిగా జనసేన అధినేత పవనకళ్యాణ్ హాజరుకానున్నారు. తొలిరోజున మహాసభల ప్రారంభానికి సూచనగా అతిథులను ఆహ్వానిస్తూ వందమంది చిన్నారులతోభారీ నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారు. అదే రోజున తానా పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ మ్యుజికల్‌ నైట్‌, సినీనటుడు శివారెడ్డి వినోద కార్యక్రమం తదితరాలు ఉంటాయి. రాత్రికి తానా ఎక్స్‌లెన్స్‌ పురస్కారాలు అందిస్తారు. రెండో రోజు తానా పరేడ్‌ నిర్వహిస్తారు. ఖఎ మ్యుజికల్‌ జర్నీ విత్‌ ఎం.ఎం.కీరవాణిగ, గాయని సునీతతో లైవ్‌ తదితర కార్యక్రమాలు ఉంటాయి. అయితే తానా మహాసభలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుణ్నిఆహ్వానించారు. జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ వేర్వేరు కార్యక్రమాల్లో కీలకోపన్యాసాలు చేయనున్నారు. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ లీడర్‌షిప్‌గ అనే అంశంపై భారత్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రసంగిస్తారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సినీ రచయిత కె.విజయేంద్రప్రసాద్‌, నిర్మాత అశ్వనీదత్‌ తదితరులు మహాసభల్లో పాల్గొననున్నారు. ఏపి , తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు వేడుకలకు హాజరుకానున్నారు. స్వామి పరిపూర్ణానంద, యేర్పేడు స్వామీజీ తదితరుల ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మేడసాని మోహన్‌ అష్టావధాన కార్యక్రమం ఉంటుంది.