బహుశా.....ఇలా ఇప్పటివరకు ఏ హీరో చేసి ఉండడు!!

SMTV Desk 2019-07-04 11:53:14  

ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన అభిమానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మంచు మనోజ్ వైజాగ్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు భార్గవ్ బాలు తనపేరుపై ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని మనోజ్ తెలిపాడు. భార్గవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ట్విట్టర్ లో మంచు మనోజ్ స్పందిస్తూ.."నా పేరున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నాకు ఎల్లప్పుడూ సపోర్టుగా నిలిచే నా తమ్ముడు వైజాగ్ ఫాన్స్ అధ్యక్షుడు భార్గవ్ బాలుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నా" అని మనోజ్ ట్వీట్ చేశాడు..