ముంభై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌పై 23 కేసులు నమోదు

SMTV Desk 2019-07-04 11:51:50  hafeez sayyad

లాహోర్: ముంభై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌తో పాటు అయన అనుచరులపై 23 కేసులు నమోదు చేసినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీరందరూ ఉగ్రవాద కార్యకలాపాలకు ఐదు ట్రస్టుల ద్వారా నిధులను సేకరించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పాక్‌ వారిపై కేసులు నమోదు చేసింది. ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారులైన లష్కరే తోయిబాకు ఈ నిధులు వినియోగించారని పాక్‌ అధికారులు తెలిపారు. ఐతే ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై ఎఫ్‌ఏఎఫ్‌టి ఉక్కుపాదం మోపడంతో పాక్‌ వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. ఉగ్రవాదానికి ఆర్థికంగా సాయపడే వాటిని అక్టోబరు కల్లా అరికట్టాలని ఆ బృందం పాక్‌కు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించాలని పాక్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి తెస్తుండడంతో సయీద్‌పై కేసులు నమోదు చేసింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సాయం అందించడాన్ని నిలిపివేయకపోతే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. ఐనప్పటికి పాక్‌ కంటితుడుపు చర్యలు తీసుకుంటుంది తప్ప, ఆశించిన స్థాయిలో ఉగ్రవాద నియంత్రణకు పూనుకోవడం లేదు.