ట్రాఫిక్‌ పోలీసులు ఆవేదన!!

SMTV Desk 2019-07-03 13:22:07  

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా... ప్రజల తీరు మాత్రం మారడం లేదు. మైసూరు రోడ్డులో ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోంది. కొన్ని సందర్భాలలో ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా... చాలా సందర్భాలలో నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. మైసూరు రోడ్డులో మంగళవారం కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు కనిపించాయి. రోడ్డుకు అడ్డంగా గ్రిల్‌ ఉన్నా... అందులో దూరేందుకు కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రయత్నించగా మరి కొందరు ఫుట్‌పాత్‌పైనే యథేచ్ఛగా ప్రయాణిస్తూ కనిపించా రు.

సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రయాణీకుల తీరులో మార్పు కనిపించడం లేదని ట్రాఫిక్‌ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలను నిలువరించే దిశలో తాము ప్రయాణీకుల మేలు కోరుతున్నామని అందుకే కొన్ని సందర్భాలలో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నారు. ట్రా ఫిక్‌ పోలీసుల గోడు ఇలా ఉంటే.. బెంగళూరు విశ్వవిద్యాల యానికి కూత వేటు దూరంలో ఉన్న నాగరభావి సర్కిల్‌లో పరిస్థితి ఘోరంగా ఉంది. రాత్రివేళల్లో చెత్తా చెదారం తెచ్చి సర్కిల్‌లో కుమ్మరించి వెడుతున్నారు. కొద్దిరోజులుగా సంచు లలో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపించింది. తక్షణం చెత్తను తొలగించాలని స్థానికులు బీబీఎంపీ అధికారులకు విన్నవించుకుంటున్నారు.