నష్టాల బాటలో స్టాక్ మార్కెట్... ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగమే కారణమంటున్న విశ్లేషకులు

SMTV Desk 2017-08-29 19:20:03  Stock market, Sensex, BSE, Share market

ముంబై, ఆగస్ట్ 29: సోమవారం స్వల్ప వృద్ధి దిశగా అడుగులు వేసిన స్టాక్ మార్కెట్, నేడు నష్టాలను చవి చూసింది. దీనికి ప్రధాన కారణం ఉత్తర కొరియా, జపాన్ మీదుగా చేపట్టిన క్షిపణి ప్రయోగంగా మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ముగింపు సమయానికి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 362.43 పాయింట్లు నష్టపోయి, 31,388.39 పాయింట్ల వద్ద, ఎన్ ఎస్ఈ నిఫ్టీ 116.75 పాయింట్ల నష్టంతో 9,800 పాయింట్ల దిగువకు ముగిశాయి. టెక్ మహీంద్రా, జీ ఎంటర్ టైన్ , విప్రో, ఎం.అండ్.ఎం తదితర షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఐడియా సెల్యులార్, ఎన్టీపీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్ మొదలైన షేర్లు నష్టపోయాయి.