టీమిండియాకు కేటీఆర్ శుభాకాంక్షలు

SMTV Desk 2019-07-03 13:17:45  india vs bangladesh, ktr

ప్రపంచకప్ లో టీమిండియా జట్టు మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. అయితే సెమీస్‌కు చేరిన భారత జట్టుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్‌ విజేతగా నిలిచేందుకు జట్టు మరో రెండు మ్యాచ్‌ల విజయాల దూరంలో ఉందని ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. స్వయంగా క్రికెట్ అభిమాని అయిన కేటీఆర్.. క్రికెట్ మ్యాచ్‌ల గురించి తరచూ ట్వీట్ చేస్తూ ఉంటారు.