ఎన్‌పీఎస్ స్కీమ్ తో నెలకు రూ.50,000 పెన్షన్...ఎలా?

SMTV Desk 2019-07-03 13:16:40  national pension system

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్ గురించి ఎప్పుడైనా విన్నారా. ఈ స్కీమ్ తో పదవీ విరమణ కోసం పక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పదవీ విరమణ తర్వాత నెలవారీగా పింఛన్ తీసుకోవచ్చు. అందుకే వీలైనంత త్వరగానే ఇందులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించడం మంచిది. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో ఎన్‌పీఎస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే 60 ఏళ్లలో రిటైర్మెంట్ తర్వాత నెలకు ఏకంగా నెలకు రూ.50,000 పెన్షన్ తీసుకోవచ్చు. అయితే ఇంత భారీ మొత్తాన్ని పెన్షన్ కింద తీసుకోవాలని భావిస్తే.. ఇందుకు తగినట్లుగానే ఇప్పటి నుంచే ఇన్వె్స్ట్ చేయడం ప్రారంభించాలి. ఎస్‌బీఐ పెన్షన్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ప్రకారం.. మీరు నెలకు రూ.6,500 ఇన్వెస్ట్ చేస్తే మీరు నెలకు రూ.51,455 పెన్షన్ తీసుకోవడం వీలవుతుంది. ఇక్కడ వార్షిక రాబడి 8 శాతంగా అంచనా వేశారు. మీరు నెలకు రూ.6,500 ఇన్వెస్ట్ చేయాలంటే.. రోజుకు రూ.216 ఆదా చేయాల్సి ఉంటుంది. అదేమీరు నెలకు ఏకంగా రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. నెలవారీ పెన్షన్ మొత్తం 79,162కు చేరుతుంది. అదే మీరు 25 ఏళ్ల వయసులో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. నెలకు రూ.4,150 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.139 ఆదా చేయాల్సి ఉంటుంది. నెలకు ఏకంగా రూ.50,452 పెన్షన్ తీసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఒక ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎన్‌పీఎస్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథఆరిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) నియంత్రిస్తూ ఉంటుంది. ఎన్‌పీఎస్ తొలిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు. తర్వాత ఈ స్కీమ్‌ను అందరికీ వర్తింపజేశారు. 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు.