మరో తెలుగు రీమేక్ లో షాహిద్ కపూర్!!

SMTV Desk 2019-06-25 15:39:39  

నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ ప్రశంసలు అందుకుంది. నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.

ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ .. మనసును తాకే ఎమోషన్స్ ను తనలో కలుపుకున్న కథ. అందువలన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని భావించిన కరణ్ జొహార్, రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ దర్శకత్వం చేయమన్నట్టుగా సమాచారం. నాని పాత్రలో షాహిద్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.