ప్రియుడితో ఏకాంతంగా...... గుండు కొట్టించిన గ్రామవాసులు!

SMTV Desk 2019-06-25 12:17:12  

ఒడిశాలో జరిగిన అమానవీయ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను, ఫొటోలను చూసిన తరువాతే పోలీసులు స్పందించి, కేసు నమోదు చేశారు. ఓ యువతి తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో చూసిన కొందరు, వారిని విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు, నడిరోడ్డుపై గుండు గీయించారు.

ఈ ఘటన శనివారం జరుగగా, దాన్ని వీడియో తీసి, వైరల్ చేశారు. ఈ ఘటన మయూర్‌ భంజ్‌ సమీపంలోని మండువా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతి మరో యువకుడితో కనిపించగానే, స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిద్దరినీ కొట్టుకుంటూ ఊరి మధ్యకు తీసుకువచ్చిన కొందరు, వారికి గుండు గీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.