రాజశేఖర్ సినిమాకి సీక్వెల్

SMTV Desk 2019-06-25 12:15:10  

రాజశేఖర్ నుంచి ఆ మధ్య వచ్చిన గరుడవేగ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారుకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. కథాకథనాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్న తీరుకి ఎక్కువ మార్కులు పడిపోయాయి. అలాంటి సినిమాకి సీక్వెల్ రానుందని తాజా ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పారు.

గరుడ వేగ సీక్వెల్ కి ప్రవీణ్ సత్తారు ఆల్రెడీ కథను సిద్ధం చేశాడు. నిర్మాత సి.కల్యాణ్ కి ఆయన కథను వినిపించడం .. కల్యాణ్ కి నచ్చడం జరిగిపోయాయి. ఇక నేను వినవలసి వుంది. ప్రవీణ్ సత్తారు గురించి నాకు తెలుసు గనుక, ఆ కథ బాగుంటుందనే అనుకుంటున్నాను. అన్నీ కుదిరితే కల్కి తరువాత నేను చేసే సినిమా అదే అవుతుంది" అని చెప్పుకొచ్చారు.