"అర్జున్ రెడ్డి" చూసి కూడా ఇంకా పవన్ కల్యాణ్ ఫ్యాన్సేనా..? : రామ్ గోపాల్ వర్మ

SMTV Desk 2017-08-29 18:47:28  RAM GOPAL VAERMA, SHOCKING COMMENTS, PAWAN KALYAN, ARJUN REDDY, VIJAY DEVARAKONDA

హైదరాబాద్, ఆగస్ట్ 29 : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే "అర్జున్ రెడ్డి" సినిమా గురించి సంచలనమైన ప్రకటనలు చేసిన వర్మ, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా మరో విషయాన్ని ప్రస్తావించారు. "అర్జున్ రెడ్డి" సినిమా చూసిన తర్వాత కూడా హీరో విజయ్ దేవరకొండ కంటే హీరో పవన్ కల్యాణ్ కు ఫ్యాన్స్ గా ఉంటారా? అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేసారు. "అసలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తి అయినా "అర్జున్ రెడ్డి" సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారా! ఒకవేళ అలా ఎవరైనా ఉంటే, వారు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం, మోసం చేసినవాళ్లు అవుతారే తప్పా, మరేమీ కారు. బ్రిటిష్ హయాంలో మన దేశానికి చెందిన నమ్మక ద్రోహులు ఎలాంటి వారో.. వీళ్లు కూడా అంతే అని నా నమ్మకం" అని వర్మ తన పోస్ట్ లో ఘాటుగా స్పందించారు.