పాక్ మిలిటరీ ఆసుపత్రిపై బాంబు దాడి....మసూద్ అజార్ టార్గెట్

SMTV Desk 2019-06-24 13:36:03  Blast in military hospital in Rawalpindi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిపై బాంబు దాడి జరిగింది. అంతర్జాతీయ ఉగ్రవాది, పుల్వామా దాడి సూత్రదారి మసూద్‌ అజార్‌ ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌ టార్గెట్‌ గా.. దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో మసూద్‌ తో పాటు మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలను అసానుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగిందంటున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.