ఎమోషనల్ అయిన జగన్ ..

SMTV Desk 2019-06-24 13:34:10  Jagan,

ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మొదటిసారి కలెక్టర్లు సదస్సు ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజలకి ఎలాంటి పరిపాలన అందించాలి, మన ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటో సీఎం జగన్ వాళ్ళకి సృష్టంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నా అవినీతి గురించి మాట్లాడుతూ, కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన మీటింగ్ జరుగుతున్నా ఈ భవనం ఒక అక్రమ నిర్మాణ కట్టటం, దీనికి ఎలాంటి అనుమతులు లేవు, అక్రమ డబ్బుతో దీనిని నిర్మించారు. అలాంటి దానిలో నేడు ఎంతో మంది అధికారులు కూర్చొని పాలన గురించి మాట్లాడుకుంటున్నాము.

ఇలాంటి అక్రమాల మధ్య కూర్చొని సుపరిపాలన అందించాలని అనుకుంటున్నాం. ముందు ఇలాంటివి లేకుండా చూడాలి. అమరావతి చుట్టూ పక్కల జరిగిన ప్రతిదానిలో కూడా అక్రమాలు, అవినీతులు జరిగాయి. ఇక్కడే కాదు రాష్ట్రము మొత్తం మీద ఇలాంటివి చాలా జరిగాయి. ముందు వాటికీ స్వస్తి చెప్పాలంటూ జగన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు, జగన్ మాటలు విన్న అక్కడి కలెక్టర్లు ఒక్కసారి బిత్తరపోయారు.

ఆయనే సమావేశం ఏర్పాటు చేసి, అయన కూర్చుకున్న కుర్చీని అవినీతి మాయం అంటూ, అలాంటి వాటికీ చెక్ పెట్టాలని చెప్పటం చూస్తుంటే ముచ్చటేస్తుందని బయటకు వచ్చిన కలెక్టర్లు చెప్పుకొచ్చారు. అలాగే జిల్లాలో పరిపాలన విషయంలో మీ బాధ్యత మీరు చేయండి. అవినీతి రహిత పాలన అందించటానికి మీ వంతు కృషి చేయండంటూ చెపుతూ, ముఖ్యంగా విద్య వ్యవస్థ లో సమూలమైన మార్పులు తీసుకోని రావాలని ఆదేశించాడు